నవతెలంగాణ-హైదారాబాద్: తమిళనాడులో ఓ కార్పొరేషన్ కేసు దర్యాప్తు విషయంలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ) వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఆక్షింతలు వేసిన విషయం తెలిసిందే. ఈడీ అన్ని పరిమితులు దాటిందని మొట్టికాయలు వేసింది.తాజాగా ఈ అంశంపై శివసేన(యూబీటీ)నేత సంజయ్ రౌతు స్పందించారు. ఈడీ అనేది బీజేపీ, ప్రధాని మోడీలకు ఆయుధాం అని మండిపడ్డారు. ఎక్కడైతే ఈడీ దాడులు చేస్తుందో అక్కడ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రమేయం ఉంటుందని మహారాష్ట్రలోని ఓ స్థానిక మీడియా సమావేశంలో ఆరోపించారు. తాను కూడా ఈడీ బాధితుడినే అని, తనలాంటి వాళ్లను బీజేపీ తన ఆయుధంతో భయపెట్టాలని చూస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే రాహుల్ గాంధీ విదేశాంగ మంత్రిని అడిగిన ప్రశ్నల్లో తప్పేముందని ప్రతిపక్షనేతకు ఆయన మద్దతు తెలిపారు. “రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలో తప్పేంటి? దేశంలోని ప్రతి పౌరుడి మనసులో ఈ ప్రశ్న ఉంటుంది. ఈ ప్రశ్న కేవలం బిజెపి మద్దతుదారులకే కాదు. దేశంలోని 1.4 బిలియన్ల ప్రజలు ఎల్లప్పుడూ దీనిని నమ్ముతారు: మీరు పాకిస్తాన్‌ను నమ్మకూడదు. అది మొదటి అంశం. రెండవ అంశం ఏమిటంటే, ట్రంప్ నుండి మనకు ఏమి ప్రయోజనం ఉంది? ట్రంప్ మనకు హాని మాత్రమే చేశాడు. మా నిరంతర ప్రయత్నాలు ఉగ్రవాదంపై పోరాటంపై దృష్టి సారించాయి; ఇది ఇజ్రాయెల్ లాగా భూమిని ఆక్రమించుకోవడం గురించి కాదు,ష అని సంజయ్ రౌతు అన్నారు.