Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. సంబురాలలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు సంక్రాంతి విశిష్టతను చాటిచెప్పే ముగ్గుల పోటీలను నిర్వహించారు. బాలికలు ఉత్సాహంగా పాల్గొని పాఠశాల వరండాలో  అందమైన రంగురంగుల ముగ్గులను వేశారు. విద్యార్థులందరు ఉల్లాసంగా పాఠశాల ఆవరణలో గాలి పటాల్ని ఎగురవేసి సంబురంగా వేడుకలను జరుపుకున్నారు. ఉపాధ్యాయులు విదార్థులకు సంక్రాంతి విషష్టతను వివరిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలైన బాలికలకు బహుమతులను అందజేశారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు మాసం శ్రీనివాస్ గౌడ్, సుమలత, శిరీష, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -