నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్
బీబీపేట మండలంలోని జనగామ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళ లకు ముగ్గుల పోటీలను మంగళవారం గ్రామపంచాయతీ వద్ద నిర్వహించారు. ఆ గ్రామ ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి నందిని, ద్వితీయ బహుమతి తాబితా, తృతీయ బహుమతి మౌనికలకు లభించగా, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన మట్ట శ్రీనివాస్ ను ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు, గ్రామస్తులు శాలువాలు కప్పి
సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బిబిపేట మండలం మాజీ వైస్ ఎంపీపీ కప్పేర రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ పాత స్వామి, వార్డు మెంబర్లు నరసింహ చారి, కుమ్మరి శ్యామల, గ్రామ కార్యదర్శి కాశి కళ్యాణ్, గ్రామస్తులు బోధస్ సాయికుమార్, కప్పేర వెంకట్ రాంరెడ్డి, సిద్ధరాంరెడ్డి, జీవన్ రెడ్డి, ఐకెపి సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ కళ్యాణి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.



