లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు ప్రధానం
నవతెలంగాణ – కట్టంగూర్
తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని స్థానిక సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో మంగళవారం కట్టంగూర్ లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. మన సంస్కృతిని ప్రేమిస్తూ ముందు తరాలకు అందించడం మనందరి బాధ్యత అన్నారు. సంక్రాంతి పండుగను మరింత అందంగా మలిచేది ముగ్గులేనని అన్నారు.
అనంతరం గెలుపొందిన విజేతలకు ఎస్సై రవీందర్, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ బుడిగె శ్రీనివాసు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ ఎర్ర శంబు లింగారెడ్డి, డీసీ డెంకల సత్యనారాయణ, తన్నీరు ప్రమీల, అధ్యక్షులు చిక్కు శేఖర్, కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి పోగుల రాములు, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్ కల్లూరి వెంకటేశ్వర్లు సభ్యులు కడారి మల్లికార్జున్ రాపోలు వెంకటేశ్వర్లు, గోషిక ఉమాపతి బొడ్డుపల్లి వెంకన్న, ఆకవరం బ్రహ్మచారి, బొడ్డుపల్లి రమేష్, వార్డు సభ్యులు కళ్లెం నాగేశ్వరరావు, ఏకుల సుజాత, శ్రీరామ్ సంధ్య, పురకం శ్రీను ఉన్నారు.



