Tuesday, December 30, 2025
E-PAPER
Homeజిల్లాలుపెరిగిన సంక్రాంతి సెలవులు

పెరిగిన సంక్రాంతి సెలవులు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి పండుగ సందర్భంగా వరుసగా 9 రోజులు సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. జనవరి 10వ తేదీన రెండో శనివారం కావడంతో సెలవులు మొదలై, జనవరి 18వ తేదీ ఆదివారం వరకు కొనసాగుతాయి. మరల జనవరి 19వ తేదీ సోమవారం బడులు తెరుచుకుంటాయి. గత ఏడాది కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండగా.. ఈసారి శని, ఆదివారాలు కలిసి రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే విధంగా 9 రోజులు సెలవులు ఇచ్చారు. ఇవే కాకుండా జనవరి 1వ తేదీ కొత్త ఏడాది సందర్భంగా.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున కూడా సెలవులు ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -