– ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతుల ప్రధానం..
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలో క్షత్రియ మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి నోము, ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా క్షత్రియ మహిళా గ్రూప్ సభ్యులకు నోములు ఇచ్చి స్టీల్ ప్లేట్లను బహుకరించి. నోము విశిష్టత ను తెలిపారు. ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు క్షత్రియ ప్రాంతీయ సమాజ్ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సంగీత ఖాందేశ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పండిత్ వినీత, క్షత్రియ సమాజ్ మేనేజింగ్ కమిటీ రాష్ట్ర సభ్యురాలు గటడి స్వాతి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ మహిళలు డిజె సులోచన, అల్జాపూర్ రాజ సులోచన, సంతని కమల, సాత్ పుతే మంజుల, ఘటడి జయశ్రీ, సరస్వతి, శాంతి, రూప, లలిత, జయ, మంజుల, కవిత, గీత, సునీత, ప్రమీల, రజని, రంజిత, లత, మమత, కవిత తదితరులు పాల్గొన్నారు.
క్షత్రియ మహిళల సంక్రాంతి నోము
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



