Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంతవేలం పాట వాయిదా.?

సంతవేలం పాట వాయిదా.?

- Advertisement -

పెరిగిన తైబజార్ ఆదాయం 
నవతెలంగాణ – కట్టంగూర్
మండల కేంద్రమైన కట్టంగూర్ గ్రామపంచాయతి పరిధిలో నిర్వహించే పశువుల సంత  వేలం పాట వాయిదా పడింది. పశువులసంత తో పాటు తైబజార్ నిర్వహణకు సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు. సంత వేలంకు తొమ్మిది మంది ధరావత్ చెల్లించగా  నిర్ణీత సమయానికి ఎవరు పాటకు రాకపోవడంతో ఈనెల 23వతేదికి వాయిదా వేశారు.

తైబజార్ వేలంపాటను కట్టంగూర్ కు చెందిన  నమ్ముల యాదగిరి  అత్యధికంగా రూ.2, 83000  పాడి  దక్కించుకున్నారు. గతేడాది ఈ పాట రూ.1,82,000 పలుకగా  ఏడాది లక్ష రూపాయలు అధిక ధర పలికింది. ఈ వేలం పాటలో  డివిజనల్ పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, మండల అభివృద్ధి అధికారి పెరుమాళ్ళ  జ్ఞాన ప్రకాష్ రావు , మండల పంచాయతీ అధికారి స్వరూపారాణి, గ్రామ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్,  ఉప సర్పంచ్ గుండు రాంబాబు, పంచాయతీ కార్యదర్శి అశోక్, వార్డు సభ్యులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -