Tuesday, October 28, 2025
E-PAPER
Homeసినిమా'సంతాన ప్రాప్తిరస్తు' రిలీజ్‌కి రెడీ

‘సంతాన ప్రాప్తిరస్తు’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర ఎంటర్‌ టైన్‌ మెంట్‌, నిర్వి ఆర్ట్స్‌ బ్యానర్స్‌ పై మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్‌ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా నవంబర్‌ 14న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సోమవారం ఈ సినిమా నుంచి ‘తెలుసా నీ కోసమే..’ లిరికల్‌ సాంగ్‌ను ప్రొడ్యూసర్‌ సురేష్‌ బాబు అతిథిగా రిలీజ్‌ చేశారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజరు అరసాడ ఈ పాటను బ్యూటీఫుల్‌గా కంపోజ్‌ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్‌ అందించగా.. అర్మాన్‌ మాలిక్‌ మనసుకు హత్తుకునేలా పాడారు.
ప్రొడ్యూసర్‌ మధుర శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ,’పిల్లలు పుట్టకపోవడం అనేది బిజీ లైఫ్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్స్‌ గానీ, ఇతర ప్రొఫెషన్స్‌లో ఉన్న వాళ్ల జీవితాల్లో పెద్ద సమస్యగా మారింది. గత కొన్నేళ్లుగా మన సొసైటీలో ఈ సమస్యను చూస్తున్నాం. ఈ పాయింట్‌తో ఈ సినిమాను ఎలాంటి వల్గారిటీ లేకుండా మంచి ఫన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించాం. మా క్లోజ్‌ సర్కిల్‌లో సినిమా చూసిన వారంతా చాలా బాగుందని చెబుతున్నారు. మేము చేసిన సినిమాలన్నీ సురేష్‌ సంస్థ ద్వారానే డిస్ట్రిబ్యూట్‌ అవుతుంటాయి’ అని అన్నారు.
డైరెక్టర్‌ సంజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘ఈ రోజు సమాజంలో కపుల్స్‌ ఎదుర్కొంటున్న సమస్య నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అయితే ఎక్కడా సందేశాలు ఇచ్చేలా సినిమా ఉండదు’ అని అన్నారు.
‘ఇందులో సాంగ్స్‌ చాలా బాగున్నాయి. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజరుకు కంగ్రాట్స్‌. ఈ సినిమా మంచి మ్యూజికల్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నా’ అని నిర్మాత సురేష్‌ బాబు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -