Friday, October 3, 2025
E-PAPER
Homeఆటలుటెస్ట్ కెప్టెన్సీ శాంటో రాజీనామా

టెస్ట్ కెప్టెన్సీ శాంటో రాజీనామా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీలంక తో రెండో టెస్టులో ఓటమి తర్వాత బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో తన సారధ్య బాధ్యతలకు రాజీనామా చేశాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు శనివారం (జూన్ 28) అధికారికంగా ప్రకటించాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే తన నిర్ణయాన్ని “కొన్ని రోజుల క్రితమే” బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ విభాగానికి తెలియజేసినట్లు నజ్ముల్ హుస్సేన్ శాంటో తెలిపారు. ఇటీవలే   శాంటోను వన్డే కెప్టెన్‌ నుంచి తొలగించి అతని స్థానంలో మెహిదీ హసన్ మిరాజ్‌ను నియమించారు. టెస్ట్ కెప్టెన్ కు కూడా గుడ్ బై చెప్పడంతో మెహిదీ హసన్ మిరాజ్‌ కు టెస్ట్ నాయకత్వ బాధ్యతలను అప్పజెప్పే అవకాశం ఉంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -