- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గిరిజన సంక్షేమశాఖ నూతన సంచాలకులుగా సంతోష్ బీ.ఎం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆయనకు పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అడవుల్లో చివరి మజిలీల్లో ఉన్న గిరిజనులకు చేరేలా కృషి చేస్తానని తెలిపారు. వారం రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను, సంక్షేమ అవసరాలను తెలుసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం ఆయన సచివాలయంలో సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
- Advertisement -



