Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ సమావేశం..

సపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
మహిళా శిశు సంక్షేమ శాఖాజిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో సపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. సపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ లో ఎన్నిక కాబడిన మునిపల్లి, నల్లూరు దుబ్బ తాండ, వెంకటాపూర్ గ్రామాలలో రాజస్థాన్ నుండి వచ్చిన ఓం ప్రకాష్ డిప్యూటీ డైరెక్టర్, సి డి పి వో రావత్ రామ్, స్టేట్ కోఆర్డినేటర్ మెర్విన్ పాల్గొని మూడు రోజుల నుండి క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ కేంద్రాలలో గమనించిన అంశాల గురించి సీ డీ పి వో లకు, సూపర్ వైజర్ లకు పోషణ్ అభియాన్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. పోషణ్ ట్రాకర్ లో నింపబడిన వివరాల ఆధారముగా సపోషిత్ గ్రామ పంచాయతీ లు ఎన్నిక కాబడతాయి కాబట్టి సరైన వివరాలు నమోదు చేయాలని చెప్పారు.  ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ కార్యాలయము నుండి వచ్చిన ఎక్బాల్ కి జల్లాకి మంజూరు ఐన 300 అంగన్వాడీ కేంద్రాలలో న్యూట్రి గార్డెన్ లు పెంచడానికి సహాయ సహకారాలు అందించాలని జిల్లా సంక్షేమ అధికారి కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad