Thursday, January 8, 2026
E-PAPER
Homeసినిమా'సరస్వతి' షూటింగ్‌ పూర్తి

‘సరస్వతి’ షూటింగ్‌ పూర్తి

- Advertisement -

విలక్షణ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్‌కుమార్‌ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి దోస డైరీస్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘సరస్వతి’. హై-కాన్సెప్ట్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది.
ఈ సందర్భంగా దర్శకురాలు వరలక్ష్మి శరత్‌కుమార్‌ మాట్లాడుతూ,’సినిమా చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేశాం. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరి ఆర్టిస్ట్‌కు, టెక్నీషియన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది’ అని తెలిపారు. జీవా, ప్రకాష్‌రాజ్‌, నాజర్‌, ప్రియమణి, రాధిక, కిషోర్‌కుమార్‌, శ్రీకాంత్‌ అయ్యర్‌, రావురమేష్‌, సప్తగిరి, మైమ్‌గోపి, హరేష్‌పరేడే, తులసి, రఘుబాబు, దేవీ ప్రసాద్‌, వెంకట్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం : వరలక్ష్మి శరత ్‌కుమార్‌, సహ దర్శకుడు : నరేష్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత : ప్రవీణ్‌ డేనియల్‌, సినిమాటోగ్రాఫర్‌ : ఎడ్విన్‌ సకారు, సంగీతం : తమన్‌, ఎడిటింగ్‌ : వెంకట్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: సుధీర్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ : విక్రమ్‌ స్వామి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ : సురేష్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -