Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సరస్వతి లిటరరీ ఫెస్టివల్‌ - 2024లో లిటిల్ స్కాలర్స్ విద్యార్థుల ప్రతిభ 

సరస్వతి లిటరరీ ఫెస్టివల్‌ – 2024లో లిటిల్ స్కాలర్స్ విద్యార్థుల ప్రతిభ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి : హైదరాబాద్ జేఎన్టీయూ లో వర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సరస్వతి లిటరరీ ఫెస్టివల్ 2024 కార్యక్రమంలో లిటిల్ స్కాలర్స్ హై స్కూల్, కామారెడ్డి విద్యార్థులు ఇండియన్ క్విజ్, మోడల్ యునైటెడ్ నేషన్స్ (ఎం యు ఎన్ ) పోటీల్లో ప్రతిభను కనబరిచారు. ఈ గొప్ప సాహిత్య మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్  ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు మార్గదర్శకతనిచ్చారు. ఇతర విశిష్ట అతిథులుగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరాం కృష్ణారావు, డీసీపీ శిల్పవల్లి, దర్శకులు శివ నిర్వాణ, సాయి రాజేష్, సాగర్ కె చంద్ర, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, పి ఎన్ బి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మాజీ రావు, కథా ప్రవచనకారిణి రామదేవి పాల్గొన్నారు.

భరణి  తల్లిదండ్రులు తమ పిల్లలపై సమయాన్ని కేటాయించాలని, మొబైల్ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించగా, డీసీపీ శిల్పవల్లి  నీతి కథలు వినడమే కాదు, జీవితం కోసం వాటినీ అన్వయించుకోవాలన్నారు. ఇండియన్ క్విజ్‌లో పాల్గొన్న విద్యార్థులు 9వ తరగతి విద్యార్థులు అక్షయ లక్ష్మి, నందిత గౌడ్, అక్షర,10 వ తరగతి విద్యార్థులు రణేష్, చేతన్ సాయి, సుశాంత్, ప్రీతి రెడ్డి పాల్గొన్నారు. ఫైనల్ రౌండ్‌లో ఇండోనేసియా దేశ ప్రతినిధులుగా శాంతియుత పరిష్కారాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ విజయవంతమైన ప్రదర్శనపై లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ యాజమాన్యం గర్వంగా భావిస్తూ, విద్యార్థులు, ఉపాధ్యాయులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -