- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న మహా పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని సరస్వతీ పుష్కరాలు సోమవారం సాయంత్రం అట్టహాసంగా ముగిశాయి. చివరి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. 12 రోజుల పాటు సాగిన సరస్వతీ పుష్కరాలకు దాదాపు 30 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే భక్తుల కోసం ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ బస్సుల ద్వారా సంస్థకు 12 రోజుల్లో రూ. 8 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం.
- Advertisement -