తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తి హీరోగా ప్రిన్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తోంది.
తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టీమ్ అందరూ సెట్లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను మేకర్స్ షేర్ చేశారు. అలాగే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తుండగా, ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్లో ఈ సినిమా తెరకెక్కతోంది.
ఈ చిత్రానికి దర్శకత్వం: పిఎస్ మిత్రన్, నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్, సహ నిర్మాత: ఎ.వెంకటేష్, సంగీతం: యువన్ శంకర్ రాజా.
‘సర్దార్ 2’ షూటింగ్ పూర్తి
- Advertisement -
- Advertisement -