Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు 

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – పెబ్బేరు 
 సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతిని వేడుకలను  మండల గౌడ సంఘం అధ్యక్షుడు మాచర్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పెబ్బేరు పురపాలక కేంద్రంలోని సుభాష్ చౌరస్తాలో సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ 300 సంవత్సరాల క్రితమే విరోచిత పోరాటం చేసి తెలంగాణ బహుజన తెలంగాణ బహుజన పోరాటయోధుడు యోధుడు అణగారిన పేద బడుగు వర్గాలపై నవాబులు యల్మా దొరలు  చేస్తున్న అరాచకాలపై పోరాటం చేసిన మహా వీరుడు అగ్రవర్ణాలే రాజ్యపాలన ఎందుకు చేయాలి అనే సంకల్పంతో మన రాజ్యాన్ని మనమే ఏలుకుందాం అన్ని వర్గాల ప్రజలను సమకూర్చి 12వేల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ కోటపై బహుజనుల రాజ్యము ఏర్పాటు చేశారు. కనుక బడుగు వర్గాలందరూ సర్దార్ సర్వాయి పాపన్న  స్ఫూర్తిని తీసుకొని పోరాటం  చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అక్కి శ్రీనివాస్ గౌడ్,ఎస్ రామన్ గౌడ్, జి వెంకటేశ్వర్ గౌడ్( ఎన్ ఆర్ జీ) రాఘవేందర్ గౌడ్,జి నరసింహ గౌడ్, జనార్దన్ గౌడ్, మహేందర్ గౌడ్,బసవరాజ్ గౌడ్, రంగస్వామి గౌడ్,సురేందర్ గౌడ్, నీరుగంటి వెంకటేష్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,రమేష్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, మోహన్ గౌడ్,ఉమేష్ గౌడ్,శివశంకర్ గౌడ్,పి వెంకటేశ్వర్ గౌడ్,శేఖర్ గౌడ్ కృష్ణ గౌడ్,రామన్ గౌడ్,వెంకటయ్య గౌడ్,సాయి గౌడ్, బత్తుల అనిల్ కుమార్ గౌడ్, గుండ్రాతి రాకేష్ గౌడ్, గుండ్రాతి బాలా గౌడ్,బాధగౌని కళ్యాణ్ గౌడ్, అల్వాల ప్రవీణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad