Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారత దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్

భారత దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్

- Advertisement -

– కమ్మర్ పల్లిలో రన్ ఫర్ యూనిటి కార్యక్రమం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
భారత దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఎం.వెంకట్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జాతీయ ఏకతా దినోత్సవం సందర్భంగా భారత దేశ ఐక్యతకు ప్రతీకైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినోత్సవంను పురస్కరించుకొని కమ్మర్ పల్లి  పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఎం.వెంకట్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ వరకు ఐక్యత ర్యాలీని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఎస్ఐ ఎం.వెంకట్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన ఐక్యతా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. అనంతరం ఐక్యత ర్యాలీలో విజేతలుగా నిలిచిన పలువురికి పోలీస్ శాఖ తరపున మెడల్స్ ను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం, విద్యార్థులు, యువకులు, పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -