- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం మహిళలకు ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా మండలంలోని పెద్దతూండ్ల గ్రామపంచాయతీలో గురువారం సర్పంచ్ బండారి నర్సింగరావు, ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రెండో విడతగా ప్రతి ఆడబిడ్డకు చీరే అందాలనే ఉద్దేశంతో మరో మారు ఇందిరమ్మ చీరల పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జంబోజు సంధ్యారాణి-రవీందర్,తాటికొండ కేశవచారి,కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా కార్యదర్శి మండల రాహుల్,జక్కుల వెంకటస్వామి యాదవ్,రాజేశం,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



