- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గోవాతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్–సి మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో 75 బంతుల్లో 157 పరుగులు చేసి జట్టును భారీ స్కోర్‌కు చేర్చాడు. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో టీ20 శైలిలో బ్యాటింగ్ చేశాడు. ముషీర్ ఖాన్ (60), హార్దిక్ తమోర్ (58) సహకారంతో ముంబై 50 ఓవర్లలో 448 పరుగులు చేసింది. ఇది టోర్నీ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరు. ఈ ఇన్నింగ్స్‌తో సర్ఫరాజ్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
- Advertisement -



