Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల హామీ అమలుకు శ్రీకారం చుట్టిన సర్పంచ్

ఎన్నికల హామీ అమలుకు శ్రీకారం చుట్టిన సర్పంచ్

- Advertisement -

– నిరుపేద ఆడబిడ్డ పెండ్లికి అర మాసం బంగారం కనుకగా అందజేత 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
 మండల కేంద్రంలో సర్పంచ్ గా గెలుపొందిన కొత్తపల్లి  హారిక అశోక్ తన ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపల్లి హారిక అశోక్ తమను గెలిపిస్తే నిరుపేద కుటుంబంలో ఆడబిడ్డ పెళ్లికి అర మాసం బంగారం కానుకగా అందిస్తామని హామీలు ఇచ్చారు. అందులో భాగంగా ఆదివారం రాత్రి నిరుపేద ముస్లిం సలీం కూతురు వివాహానికి హాజరైన సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ అర మాసం బంగారాన్ని పెండ్లి కానుకగా పెళ్లి కూతురుకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ హారిక అశోక్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా నిరుపేద సలీం కూతురుకు పెళ్లి కానుకగా అర మాసం బంగారాన్ని అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అహ్మద్ హుస్సేన్, మైలారం సుధాకర్, మల్యాల సుభాష్ గౌడ్, రేంజర్ల మహేందర్, నవాబ్ పాషా,

జెల్లా రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -