నవతెలంగాణ – గోవిందరావుపేట
గ్రామ పంచయతీకి సర్పంచ్ సమర్ధుడై ఉండాలని ఆట బొమ్మల కాదని మాజీ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పోరిక కిరణ్ కుమార్ ను గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వై సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. సొంతంగా నిర్ణయాలు తీసుకునే సమర్థత ఉన్నవారికే గ్రామ ప్రజలు పట్టం కట్టాలన్నారు. తప్పుడు 420హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పంగనామలు పెట్టిందన్నారు. గోవిందరావు పేట గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన బిజెపి మద్దతు ఇచ్చిన అభ్యర్థి పోరిక కిరణ్ కుమార్ గెలుపుకోసం కృషి చేయాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తానన్న 2500 ఏమయ్యాయి.విద్యార్థినిలకు ఇస్తానన్న స్కూటీలు ఏమయ్యాయి?
తులం బంగారం ఏమైంది?ఆటో అన్నలకు ఇస్తానన్న 15000 ఏమైంది?పెన్షన్లు పెంపు ఏమైంది? అని ప్రశ్నించారు. పోరిక కిరణ్ కుమార్ పై కాంగ్రెస్ నేతలు అసత్యపు ప్రచారాలు మానుకొను కోవాలని హితవు పలికారు. ఈకార్యక్రమంలో మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, మండల అధ్యక్షుడు లకావత్ నర్సింహ నాయక్, బిజెపి మండల అధ్యక్షుడు మార్క సతీష్, బిజెపి జిల్లా కార్యదర్శి చందా జ్యోతి, మాజీ ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాసరావు,మాజీ ఉప సర్పంచ్ హన్మంత రావు,గ్రామ పార్టీ అధ్యక్షులు రమేష్,శక్తి కేంద్ర ఇంచార్జి బొల్లం పల్లి మురళి, నమవరపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



