Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇఫ్తార్ విందులో పాల్గొన్న సర్పంచ్ చంద్రకళ-కనకయ్య 

ఇఫ్తార్ విందులో పాల్గొన్న సర్పంచ్ చంద్రకళ-కనకయ్య 

- Advertisement -

నవతెలంగాణ -మిరుదొడ్డి 
రుద్రారం గ్రామంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఎంతో సౌహార్దపూర్వకంగా జరిగిందని ముస్లిం కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ సోహెల్ పాషా  తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన రమజాన్ నెలలో గ్రామ సర్పంచ్ ఇదరి చంద్రకళ కనకయ్య గారు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ముస్లిం సమాజానికి ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమాలో గ్రామంలో ఐక్యత, సోదరభావం మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. రమజాన్ నెల సహనం, దానం మరియు సేవాభావాన్ని నేర్పే పవిత్రమైన నెల అని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సర్పంచ్ కి, ఉప  సర్పంచ్ రమేష్ గౌడ్ గ్రామ వార్డ్ సభ్యులు దీపంపల్లి కనకయ్య పర్శరాములు గ్రామ ప్రముఖులు రాజేశ్వర్ రెడ్డి పడాల రాజు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్  మాట్లాడుతూ రమజాన్ పవిత్ర నెలలో ఇఫ్తార్ విందు ద్వారా అన్ని వర్గాల ప్రజలు కలిసి సోదరభావంతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో మతభేదాలు లేకుండా అందరూ ఐక్యంగా జీవించాలి అని ఆమె తెలిపారు. ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు ఖాసిమ్ జాఫర్ జైనూద్దీన్ అన్వర్ పాషా ఐజాస్ పాషా జల్లు అనర్ షాదుల్ సమీర్ అజీమ్ వాలియొద్దీన్ రహీం అన్వే్ర్ ఫజలే ఖదీర్ ఖాసీమ్ జాఫర్ హబీబ్  రుద్రారం గ్రామ ముస్లిం సోదరులు అందరు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -