నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కంఠాలి గ్రామమంతటికీ మంచినీరు సరఫరా అయ్యే ట్యాంక్ ను సర్పంచ్ మాత్రే నాగ్ నాథ్ ఆదివారం దగ్గరుండి మరీ శుభ్రం చేయించారు. ట్యాంక్ లోని గోడలకు పేరుకుపోయిన పాకరను తీసివేయించారు. అంతేకాదు.. ట్యాంక్ లోపల మట్టి, చిన్న చిన్నరాళ్ళను తీసివేయించారు. అనంతరం ట్యాంక్ లోపల మంచినీటితో పరిశుభ్రంగా కడిగించారు. అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ వేసి ట్యాంక్ ను శుద్ధి చేయించారు.
గ్రామంలో కొంతమంది పెద్దలు నేరుగా బోరు నుండి వచ్చే నీటి పైప్ కే డైరెక్ట్ కనెక్షన్ చేసి నీటిని వృధా చేస్తున్నారని తెలిసింది. దీంతో ముందు భాగంలో ఉన్న గ్రామస్తులకు నీరందడం లేదు. డైరెక్ట్ గా పైపుకి నల్లాలు పెట్టినవారు వారికి వారే కనెక్షన్ ను తీసేసుకోవాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు మురళి పటేల్ తదితరులు పాల్గొన్నారు.




