నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రం నుండి వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రైతులకు దారి మార్గం లేకపోవడంతో జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ రోడ్డు మార్గం మొరం మట్టిని వేసి దారి ఏర్పాటు చేశారు. గత కొన్ని ఏళ్లుగా కాలినడకకు కూడా దారి లేక గుంతలు పడి అస్తవ్యస్తంగా ఈ దారి ఉండేది. వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితిని వ్యవసాయ రైతులు, స్థానికులు ఎదుర్కొన్న రోజులు చాలానే ఉన్నాయి. గ్రామ రైతుల కోరిక మేరకు దారిని బాగు చేయడం వలన రైతులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతము కాలినడకతో పాటు ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు వెళ్లేందుకు వీలుగా దారిని సుగమం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు , గ్రామానికి చెందిన యువకులు తదితరులు పాల్గొన్నారు.
పోలాలకు వెళ్లే రోడ్డు మార్గం సుగుమం చేసిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



