Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కమ్మర్ పల్లిలో షాపు ప్రారంభోత్సవంలో పాల్గొన్న సర్పంచ్ దంపతులు

కమ్మర్ పల్లిలో షాపు ప్రారంభోత్సవంలో పాల్గొన్న సర్పంచ్ దంపతులు

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి  : మండల కేంద్రంలో అజయ్ చికెన్ సెంటర్, ఆర్డర్ మెస్ లో  నూతనంగా ఫ్యామిలీ సెక్షన్ ను స్థానిక సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ దంపతులు బుధవారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఫ్యామిలీ సెక్షన్ ప్రారంభించిన అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. షాప్ యజమాని అలిశెట్టి అజయ్ కి ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షాపు యజమాని అజయ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో దశాబ్దాలుగా అజయ్ చికెన్ సెంటర్, ఆర్డర్ మెస్ పేరుతో షాపు నిర్వహిస్తున్నామన్నారు. మండలంలోని పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు సౌకర్యార్థం అజయ్ చికెన్ సెంటర్, ఆర్డర్ మెస్ లో ఫ్యామిలీ సెక్షన్ ప్రారంభించినట్లు తెలిపారు. తమ షాపు ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన, రుచికరమైన ఇంటి భోజనాన్ని అందిస్తామన్నారు.ఇన్ని సంవత్సరాలుగా నన్ను నమ్మి ఆదరించిన కస్టమర్లకు, మిత్రులకు, నా కుటుంబ సభ్యులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. నాపై ఎల్లప్పుడూ ఇలాగే ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.షాపు ప్రారంభోత్సవంలో పాల్గొన్న   గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ దంపతులను శాలువాలతో సత్కరించి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి  గంగా జమున, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కొత్తపల్లి గణేష్, సున్నం మోహన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -