నవతెలంగాణ – ఆలేరు రూరల్
టంగుటూరు గ్రామంలో యాక్షన్ ఎయిడ్ (ACTION AID) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 150 మంది పాఠశాల విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. యాక్షన్ ఎయిడ్ ప్రతినిధులు శివలింగం,కవిత,మాధవి సమన్వయం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్,ఉపసర్పంచ్ భూపెల్లి అక్షయ–రాజు హాజరై విద్యార్థులకు తమ చేతుల మీదుగా బ్యాగులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.గ్రామంలోని పిల్లలకు అవసరమైన సహాయాన్ని అందించడంలో స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జన్నే రవి,గ్రామస్థులు జన్నే పాండు,జూకంటి మధు,జూకంటి గణేష్,కల్లెపు నరేష్,జూకంటి బాబు, కల్లెపు శేఖర్,బండి గణేష్,భూపెల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



