- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు సర్పంచ్ ఎనుగందుల శైలేందర్ ను సత్కరించారు. ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం సర్పంచ్ శైలేందర్ ను ఆలయానికి ఆహ్వానించి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గురువారం ఆలయ వార్షికోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు బద్దం రాజారెడ్డి, బద్దం గంగారెడ్డి, బద్దం సుభాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



