Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్

ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్: గ్రామంలో పశుసంవర్ధక అభివృద్ధి కోసం సర్పంచ్ మమత సంతోష్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో పశువులకు గర్భకోశ సంబంధిత టీకాలు, గాలి కుంటు నివారణ టీకాలు, వివిధ రకాల వైద్య చికిత్సలు అందించబడినాయి. మొత్తం 70 పశువులకు వైద్య సేవలు అందించటం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సహాయ సంచాలకులు డా.రాజశేఖర్, పశువైద్యాధికారులు డా. చైతన్య,డా.నవీన్ హాజరై పశువులకు చికిత్సలు అందించారు. అలాగే గోపాలమిత్ర సూపర్వైజర్ భాను, వీఎలో శ్రీనివాస్, ఉప సర్పంచ్ మద్దెల నరేష్, వార్డ్ సభ్యులు జవ్వాజి ప్రదీప్, ఎర్ర దేవేంద్ర, తుంగ సుస్మిత పాల్గొన్నారు.గోపాలమిత్రలు కృష్ణ, సుధాకర్, శ్రీకాంత్, కుమారస్వామి, వరలక్ష్మి మరియు రైతులు కరికి బీరయ్య, వస్పరి రాజయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -