Monday, March 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన బోరును ప్రారంభించిన సర్పంచ్

నూతన బోరును ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్                                       
జుక్కల్ మండల కేంద్రంలోని నిర్ల లింగేశ్వర స్వామి గుడి దగ్గర నూతన బోరును స్వీచాన్ చేసి గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ సోమవారం ప్రారంభించారని జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ సావిత్రి సాయి గౌడ్ మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా నీటి సమస్యతో ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు, కాలనీవాసులకు నీటి ఇబ్బంది ఉండేదని అన్నారు. గ్రామస్తుల కోరికల మేరకు గుడి దగ్గర బోరు వేసి గుడితో పాటు కాలనీవాసులకు కూడా నీరు అందించామని అన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు సర్పంచ్ కు, పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. యువత గ్రామ సమస్యలను వెలికి తీసి ఎప్పటికప్పడు జీపీ కార్యాలయానికి తెలియజేస్తున్నారని అన్నారు. వారి సహకరించడంతో సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తున్నామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి -సాయ గౌడ్ , జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ గల్కట్ వార్ రాజు , మాజీ సర్పంచ్ రాములు సేట్, ఉప సర్పంచ్ షేక్ ఫిర్దోస్, (వార్డు మెంబర్లు)మోతే తుకారం పటేల్, షబానా షకీల్ గారు, చంద్రకళ, సజ్జన్ వార్ సాయినాథ్ , గ్రామ యువకులు బొంపల్లి వార్ విజయ్ కుమార్ , అశోక్ అన్న, కాంచన్, మాధవరావు , నిఖిల్, గ్రామ పెద్దలు మారుతి గౌడ్, కందారే సురేష్ & గ్రామపంచాయతీ సిబ్బంది అశోక్ ఖాన్ , వీరేశం , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -