- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని గుల్లా తాండాలో మంగళవారం ఉచిత గాలికుంటు వ్యాధి టీకాల శిబిరాన్ని సర్పంచ్ రాథోడ్ సుమతి యశ్ పొల్ ప్రారంభించారని వెటర్నరీ మండల వైద్యుడు పండగ తెలిపారు. ఈ సందర్భంగా వెటర్నరీ వైద్యుడు మాట్లాడుతూ.. పశువుల దారులు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను వినియోగించుకోవాలని అన్నారు. గాలికుంటు వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తగా పశువులకు ఈ వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమతి రాథోడ్, ఉప సర్పంచ్, జిపి పాలకవర్గ సభ్యులు, జిపి కార్యదర్శి, గ్రామ పెద్దలు యశ్పాల్, జీవన్, అనిల్ రాథోడ్, ఆడి రైతులు , గోపాల మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



