Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న సర్పంచ్

క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నవతెలంగాణ-పెద్దవూర కొత్తగా ఎన్నికైన పోతునూరు సర్పంచి పెండ్యాల సంతోష్ రావు గ్రామాల్లో ప్రజల ఇంటింటికీ, ప్రతి వార్డు తిరిగి వెళ్లి మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు, పారిశుధ్యం వంటి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని చెపుతున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించడమే కాక గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని ప్రజలతో చెపుతున్నారు. ప్రజలను కలిసి, వారి ఇబ్బందులను స్వయంగా విని వాటి పరిష్కారానికి అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని కార్యదర్శి తొ కలిసి ప్రజలతో మాట్లాడారు. గ్రామాలను ఆదర్శంగా మార్చడానికి ప్రణాళికలు రచించడం, ప్రజల పట్ల తమ బాధ్యతను చాటుకుంటూ, అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి పాటుపడతామని ప్రజలతో చెపుతు ముందుకు వెళుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -