నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని శనివారం సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి తనిఖీ చేశారు.అంగన్వాడి కేంద్రంలో సమస్యలను అంగన్వాడి టీచర్ అంజలిని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అంగన్వాడి కేంద్రానికి ప్రభుత్వం సరఫరా చేసిన సరుకులను పరిశీలించారు.
అంగన్వాడి కేంద్రానికి విచ్చేసే చిన్నారులకు, గర్భిణీలు బాలింతలకు పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అంగన్వాడి కేంద్రాల పట్ల నిర్లక్ష్యం వహించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దన్నారు. కేంద్రానికి వచ్చే చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించడం ద్వారా చిన్నారులు అంగన్వాడి కేంద్రాల పట్ల ఆకర్షితులయ్యేలా కృషి చేయాలి అన్నారు.



