నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామంలో ఆర్యసమాజ్ సమీపంలో ఉన్న అంగన్వాడి కేంద్రం చుట్టుపక్కల అపరిశుభ్రత వాతావరణం నెలకొనడంతో పాటు, మరుగుదొడ్డి అవసరాల కోసం అనధికారికంగా వినియోగం పెరిగిందని స్థానిక గల్లీ వాసులు తరచుగా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సర్పంచ్ శ్రీమతి ఉషా సంతోష్ మెస్త్రి అంగన్వాడి కేంద్ర పరిసర ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, తక్షణమే శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా బురుజు ప్రాంతంలో ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా ఉన్న సమస్యలపై కూడా స్థానికులు సర్పంచ్ దృష్టికి తీసుకురాగా, ఒక్కొక్కటిగా అన్ని అభివృద్ధి పనులు చేపడతామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సందీప్, కాంగ్రెస్ నాయకులు సంగయ్యప్ప, హన్మాండ్లు, నాందేవ్ మెస్త్రి తదితరులు పాల్గొన్నారు.



