Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన సర్పంచ్

ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని ప్రభుత్వ పాదామిక పాఠశాలను సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. పాఠశాలలో ఎవరైనా డ్రాపుట్స్ విద్యార్థులు ఉంటే తమకు తెలియజేస్తే వారి తల్లిదండ్రులతో మాట్లాడుతామన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -