గ్రామ రక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు
మద్యం అమ్మకాల బెల్ట్ షాపుల నిషేధం
నవతెలంగాణ – మద్నూర్
గ్రామ సర్పంచుల ఎన్నికలు జరిగి నెల రోజులు కావస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన మద్నూర్ మండలంలోని అవల్గావ్ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన మాన్య బాయి ఆ గ్రామ ప్రజల సమస్యల పట్ల పట్టు బిగిస్తున్నారు. పోలీస్ శాఖ సూచనల మేరకు గ్రామంలో గల పాఠశాల ఆవరణంలో గ్రామానికి మెయిన్ గోడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి ఎస్సై మోహన్ రెడ్డి ద్వారా ప్రారంభించారు. అదేవిధంగా గ్రామ ప్రజల విన్నపం మేరకు గ్రామంలో మద్యం అమ్మకాల బెల్ట్ షాపులను నిషేధిస్తూ తీర్మానించి ఎక్సైజ్ శాఖ పోలీసులకు మద్నూర్ ఎస్సై కి మద్నూర్ తాసిల్దార్ కు బెల్ట్ షాపుల నిషేధం గురించి వినతిపత్రాలను అందజేశారు. ప్రజల కోరిక మేరకు గ్రామ అభివృద్ధికి పాటుపడతానని గ్రామంలో మద్యం అమ్మకాల నిషేధాన్ని చేపట్టాలని కోరిక మేరకే గ్రామస్తులంతా బెల్ట్ షాపుల నిషేధిస్తూ తీర్మానించిన కాపీలు సంబంధిత శాఖ అధికారులకు అందించడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. గ్రామ సర్పంచ్ ప్రజా సమస్యల పట్ల పట్టు బిగించడం అధికారులు సర్పంచ్ పనితీరుపై అభినందిస్తున్నారు.
ఆవల్ గావ్ లో ప్రజా సమస్యలపై పట్టు బిగిస్తున్న సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



