నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని దన్నూర్ గ్రామ అభివృద్ధికి ప్రత్యేకంగా పాటుపడాలని అభివృద్ధిని చేసి గ్రామ ప్రజల మన్ననాలు పొందాలని దన్నూరు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి, మద్నూర్ మండల తహశీల్దార్ ఎండి ముజీబ్ నూతన సర్పంచ్ జయశ్రీని కోరారు. ప్రత్యేక అధికారిగా తహశీల్దార్ సర్పంచ్ ను ప్రమాణ స్వీకారం చేయించారు. దన్నూర్ పంచాయతీ నూతన పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి పాటుపడాలని ప్రజా సమస్యల పట్ల పట్టించుకోవాలని సమస్యలు తీర్చే గ్రామ ప్రజల మన్ననాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామ పెద్దలు దేవిదాస్ పటేల్ గ్రామస్తులు గ్రామ కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు.
ఘనంగా సర్పంచ్ జయశ్రీ ప్రమాణస్వీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



