Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రవ్యాప్త దళిత సర్పంచుల సభకు సర్పంచ్ కంతి మధుకు ఆహ్వానం 

రాష్ట్రవ్యాప్త దళిత సర్పంచుల సభకు సర్పంచ్ కంతి మధుకు ఆహ్వానం 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్ 
తెలంగాణ రాష్ట్రంలో గెలుపొందిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లకు జనవరి 21న ఎం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరగనున్న సన్మాన సభకు శారాజిపేట్  సర్పంచ్ కంతి మధు శుభాకాంక్షలు తెలిపి ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బుసిపాక మహేష్ మాదిగ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆదివారం నవతెలంగాణతో వారు మాట్లాడుతూ.. ఎస్సీలు ఐక్యమత్యంగా ఉన్నప్పుడే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా బలపడతామని ఆయన అన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్లయిన జనరల్ స్థానాల్లో ఎస్సీలు గెలుపొందని పరిస్థితి నేటికీ ఉందన్నారు.

ఉప్పల్ భగయత శిల్పారాంబంలో జరిగే రాష్ట్ర వ్యాప్త దళిత సర్పంచుల సభకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరవుతరని చెప్పారు. వార్డ్ మెంబర్ గా గెలుపొందిన కంతి బాలరాజును అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన దళితులందరూ సన్మాన కార్యక్రమం పాల్గొనాలని కోరారు. వీరితోపాటు కూరెళ్ళ రమేష్. సంఘీ స్వామి,గుర్రం మహేందర్,బోట్ల శ్రీనివాస్, బైరపాక సురేష్ కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -