నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలం కల్లెడ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గంగోల్ల సుస్మిత ప్రళయ్ తేజ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో నిరుపేద కుటుంబంలో మరణం సంభవించిన కుటుంబాలకు రూ.5,000 ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించిన హామీ మేరకు మృత కుటుంబానికి ఆర్థిక సాయం బుధవారం అందజేశారు. గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం మక్కల బాలయ్య భార్య మక్కల పోసాని ఇటీవల మరణించగా, వారి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం సర్పంచ్ తరఫున రూ.5,000 నగదు సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గంగోల్ల సుస్మిత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తాను. గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటాం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భర్త ప్రళయ్ తేజ్, ఉప సర్పంచ్ ఇస్సపల్లి రాజు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



