Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాట నిలబెట్టుకున్న సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి

మాట నిలబెట్టుకున్న సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -

బాధ్యతలు చేపట్టకముందే అభివృద్ధి పనులకు శ్రీకారం
నవతెలంగాణ – తుంగతుర్తి
గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అన్నారం గ్రామ నూతన సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి,  బాధ్యతలు అధికారికంగా చేపట్టకముందే అభివృద్ధి పనులను ప్రారంభించారు. శుక్రవారం అన్నారం ఎక్స్ రోడ్డు నుండి గ్రామం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లను తొలగించే పనులను చేపట్టించి ప్రజల ప్రశంసలు పొందుతున్నారు. రాత్రి సమయంలో ప్రమాదాలకు కారణమవుతున్న చెట్లను తొలగించే చర్యలు తీసుకోవడం గ్రామ అభివృద్ధిపై తన నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తీసుకొస్తున్న కుంచాల శ్రీనివాస్ రెడ్డి చర్యలను గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నారు.

ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సర్పంచ్ పదవి చేపట్టక ముందే పనులు మొదలుపెట్టడం అభినందనీయం.ఇలాగే గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కోరుకుంటున్నాం అని తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సరిత, వార్డు సభ్యులు బింగి వెంకటేశ్వర్లు, సుకన్య, జానకమ్మ, శ్యామ్, ఉమ, ప్రవీణ్, లావణ్య, సోమయ్య, చిరంజీవి, మాజీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్, మట్టపెల్లి వెంకట్, తన్నీరు యాదగిరి, సోమశేఖర్, కృష్ణ, బోర నరేష్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -