Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం కప్ ర్యాలీని ప్రారంభించిన సర్పంచ్

సీఎం కప్ ర్యాలీని ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

పాల్గొన్న ఎంపీడీఓ, ఉపాధ్యాయులు, విద్యార్థులు
నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో గ్రామ సర్పచ్ సీఎం కప్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులతో కలిసి గ్రామంలొ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పాఠశాల హనుమంత్ రెడ్డి, ప్రసంగించారు.

సీఎం కప్ ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో క్రీడారంగంలో నైపుణ్యం కలిగిన విద్యార్థిని విద్యార్థులకు గుర్తించి వారికి ప్రోత్సాహకంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. వారి ప్రతిభను గుర్తించిన అనంతరం నియోజకవర్గస్థాయి, జిల్లా స్థాయిలో , రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో పోటీలకు ఎంపిక చేసి వారిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకు వెళ్లడని ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముఖ్య అతథిగా కార్రేవార్ సావిత్రి సాయిగౌడ్, ఎంపీడీవో శ్రీనివాస్, జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి, వెటర్నరీ వైద్యుడు పండరీనాథ్, జిపి సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -