నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని డోన్ గావ్ గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధి టీకాల శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ గురువారం ప్రారంభించడం జరిగిందని మండల పశువైద్యాధికారి పండరినాధ్ తెలిపారు . ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పశుపోషకులకు, ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని గ్రామాలలో ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలను వేయిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి చాలా ప్రమాదకరమని ఇది అంటువ్యాధి అని అన్నారు. ఇది ప్రత్యేకంగా ఫిబ్రవరి మరియు సెప్టెంబర్ మాసాలలో ఈ వ్యాధి లక్షణాలు చాలా పశువులలో జీవాలలో కనిపిస్తుంది. నోట్లోనూ కాళ్ల గిట్టల సందుల్లో ఫుండ్లు ఏర్పడడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఇది అంటువ్యాధి ఇది పశువులకు దానా ద్వారా లేక త్రాగునీటి ద్వారా ఒకటి నుండి ఇంకోటికి వ్యాధి వ్యాపిస్తుంది. చికిత్స కంటే ముందే ఈ వ్యాధి రాకముందే పశువులకు టీకాలు ఇవ్వడం వలన వ్యాధి రాకుండా నివారించవచ్చు అని అన్నారు. ఈ సదవకాశాన్ని గ్రామాలలోని పాడి రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, వెటర్నరీ వైద్యుడు, గోపాలమిత్రులు, జిపి పాలకవర్గం, గ్రామపంచాయతీ కార్యదర్శి అంజయ్య, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.
డోన్ గావ్ లో గాలీ కుంటు వ్యాధి ఉచిత టీకాలు ప్రారంభించిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



