Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి సర్పంచ్ లింగస్వామి చేయుత

మృతుని కుటుంబానికి సర్పంచ్ లింగస్వామి చేయుత

- Advertisement -

ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన బుద్దార్థి రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ లింగస్వామి యాదవ్ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాలతో శనివారం మృతుని కుటుంబాన్ని పరమర్షించి, ప్రగాఢ సానుభూతి ప్రకటించి, నివాళులర్పించారు.

సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గ్రామంలో ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియల ఖర్చుల కోసం తన వంతుగా రూ.3 వేలు ఆర్థికంగా చేయుతనిస్తానని చెప్పిన మాట ప్రకారం మృతుని కుటుంబానికి రూ.3 వేలు ఆర్థిక సాయం చేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు అక్కల రాము యాదవ్ తోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -