Friday, January 2, 2026
E-PAPER
Homeజిల్లాలుసీఎం సలహాదారుడు వేం ను కలసిన సర్పంచ్ 

సీఎం సలహాదారుడు వేం ను కలసిన సర్పంచ్ 

- Advertisement -

ఆలేరు గ్రామ సర్పంచ్ నాయని పద్మ సత్యపాల్ రెడ్డి 
నవతెలంగాణ – నెల్లికుదురు 

సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని ఆలేరు గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి శుక్రవారం హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వేం నరేందర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. మా మండల అభివృద్ధి కోసం, మా ఆలేరు గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కొంత నిధిని కేటాయించాలని కోరినట్టు తెలిపారు. వెంటనే వేం నరేందర్ రెడ్డి స్పందించి అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ క్రమంలో సర్పంచ్ వేం కు ప్రత్యే కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -