రావిరాల గ్రామ సర్పంచ్ కత్తుల కళ్యాణి యాకాంతం
నవతెలంగాణ – నెల్లికుదురు
ఎస్సై చిర్ర రమేష్ బాబును తహసిల్దార్ చందా నరేష్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లుగా రావిరాల గ్రామ సర్పంచ్ కత్తుల కళ్యాణి యాకాంతం ఆ గ్రామ ఉపసర్పంచ్ తరుణ్ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ గ్రామంలోని మమ్ములను గెలిపించిన ఓటర్లకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలని అన్నారు. గ్రామాభివృద్ధి కోసం మండల స్థాయి అధికారులనైన ఎస్సై చిరా రమేష్ బాబు ని మరియు తాహాసిల్దారు చందా నరేష్ ను కలిసి మర్యాదపూర్వకంగా శాలువాతో వారిని సత్కరించామని అన్నారు.
గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరిచేందుకు మా వంతు కృషి చేస్తామని తెలిపారు. అవసరమైతే గ్రామపంచాయతీ నిధులు సరిపోకుంటే ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మరియు ఎంపీ పోరిక బలరాం నాయక్ ను కలిసి మా గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరి ఆ నిధులను తీసుకువచ్చి గ్రామంలోని అన్ని రంగాలు అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కత్తుల కుమార్ పాల్గొన్నారు.



