Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడి సెంటర్లను పరిశీలించిన సర్పంచ్ నాంపెల్లి వీరేశం

అంగన్వాడి సెంటర్లను పరిశీలించిన సర్పంచ్ నాంపెల్లి వీరేశం

- Advertisement -

నవతెలంగాణ – టేకుమట్ల
మండలంలోని రామకృష్ణాపూర్ (వి) గ్రామంలోని మూడు అంగన్వాడి సెంటర్లను గ్రామ సర్పంచ్ నాంపెల్లి వీరేశం సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని అన్నారు. అంగన్వాడి సెంటర్లలో బాలింతలకు కావలసిన పాలు, గుడ్లు, బాలామృతం, పోషకహారాలు కలిగినటువంటి వారికి రోగ నిరోధక శక్తిని అందించే డైట్ ను తప్పక అందించాలని తెలిపారు. సుఖ ప్రాసవాలు అయ్యే విధంగా ఆహార పదార్థాలు అంగన్వాడి సెంటర్లు అందించాలని ఆయన సూచించారు. దాంతోపాటు చిన్న పిల్లలకు కూడా సరైనటువంటి ఇమ్యూనిటీ అందించే పోషకా ఆహార పదార్థాలను అందిస్తూ వారికి చదువును కూడా అందించడం హర్షనీయమని అభినందించారు. ఈ విధంగా అంగన్వాడి సెంటర్లు బాధ్యతతో పనిచేయాలని సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు కుమార్, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -