- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో ముస్లీం సోదరులు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శనివారం ఈద్గా వద్ద ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. వారిని సర్పంచ్ శైలేందర్ కలిసి ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ మత సామరస్యనికి ప్రతీక రంజాన్ పండుగ అని అన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం,ఐక్యత మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తక్కురి ముత్యం, నాయకులు మారుపక నరేష్, ముస్లిం మైనార్టీ సంఘం పెద్దలు రఫిక్, ఫారూఖ్, సాదుల్లా, అజారుద్దీన్, ఇబ్రహీం, ఇమెమోద్దీన్, హఫీజ్, సల్మాన్, నజీర్, ఉబేద్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



