Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసిన సర్పంచ్

నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం కేంద్రంలోని హమాలీవాడలో గత కొన్ని రోజులుగా బోరు చెడిపోవడంతో కాలనీ వాసులు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం మహిళలు, వృద్ధులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ సమస్యను కాలనీ వాసులు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన కాటారం సర్పంచ్ సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేసి బోరును మరమ్మతు చేయించారు. కొద్ది గంటల్లోనే బోరు రిపేర్ పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు.

అత్యవసర సమస్యపై తక్షణ చర్యలు తీసుకున్న సర్పంచ్‌కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండాలని వారు కోరారు. ఆయన వెంట ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -