- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామ సర్పంచ్ వాగ్మారే రమణ సురేష్ గొండ ఆధ్వర్యంలో గ్రామంలోని పాడుబడి పోయన బోరుబావిని పరిసరాలను శుభ్రం చేయించి వాడుకలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పరిసరాలలో మేలుకొని ఉన్న చెత్తాచెదారాన్ని ముళ్ళకంపలను పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. అనంతరం చాలా రోజులుగా అసౌకర్యంగా బోరుబావి ఉండడంతో గ్రామస్తులు బోరుబావి దగ్గరికి వెళ్లాలంటే భయాందోళనకు గురయ్యేవారు. గ్రామస్తుల కోరిక మేరకు బోరుబావిని రిపేర్ చేసి గ్రామస్తులకు నీటి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిపి కార్యదర్శి భరద్వాజ్, గ్రామ పెద్దలు , వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



