నవతెలంగాణ – జుక్కల్
99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా మంగళవారం జుక్కల్ గ్రామపంచాయతీ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ గ్రామంలోని వీధులను ప్రయాణం చీపురు పట్టి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గ్రామ అభివృద్ధిలో తమ వంతుగా నేటి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సావిత్ర గౌడ్ మాట్లాడుతూ.. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలలో భాగంగా గ్రామాల రూపురేఖలు మారిపోతాయని అన్నారు. గత ఆరు రోజులుగా గ్రామాలలో నిత్యం రోజుకో విధంగా గ్రామాలను పరిశుభ్రం చేయడం, శానిటేషన్ పనులు నిర్వహించడం, ప్లాస్టిక్ లేకుండా గ్రామ పరిశుభ్రంగా తీర్చిదిద్దడం, పిచ్చి మొక్కలను తొలగించడం, పల్లె ప్రకృతి వనాలను సంరక్షించడం, చెట్లు మొక్కలు నర్సరీలు పెంపకం నిర్వహించడం, గ్రామాలలోని వీధిలైట్లు వీధిగా ఏర్పాటు చేయడం, త్రాగునీటి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం, ఎండ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మూగజీవాలకు, పశువులకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సావిత్ర గౌడ్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి గౌడ్, జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జుక్కల్ జిపి కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



