Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయజెండాను ఎగురవేసిన సర్పంచ్ సావిత్ర సాయ గౌడ్

జాతీయజెండాను ఎగురవేసిన సర్పంచ్ సావిత్ర సాయ గౌడ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గ్రామ సర్పంచ్ కర్రేవార్ సావిత్ర సాయి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలు ఏర్పాటు చేసిన జెండా వందన కార్యక్రమంలో జెండాను గ్రామ సర్పంచ్ ఆవిష్కరించారు. అనంతరం సఫారీ కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సావిత్ర మాట్లాడుతూ సఫాయి కార్మికులు జిపికి వన్నే తెచ్చిన వారిని కొనియాడారు. గ్రామాలలో పరిశుభ్రంగా ఉండాలంటే సఫాయి కార్మికుల సేవ ఎంతో గొప్పదని వారిని దేనితో తులనాడలేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, జిపి కార్యవర్గ సభ్యులు, ఏపీ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ అసిస్టెంట్ గల్కట్  వార్ రాజు , సఫై కార్మికులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -